TNSTC అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 1518 పోస్టులు దరఖాస్తుల ప్రారంభం - ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!

Anil G

Anil G

Published: 29 జూలై 2026

Share:
TNSTC అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 1518 పోస్టులు దరఖాస్తుల ప్రారంభం - ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!

TNSTC అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 1518 పోస్టులు దరఖాస్తుల ప్రారంభం - ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు మరో మంచి అవకాశం లభించింది. తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TNSTC) 2026-27 సంవత్సరానికి సంబంధించి Graduate Apprentice, Diploma Apprentice మరియు Non-Engineering Graduate Apprentice పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,518 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్, డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ వంటి కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ శిక్షణతో పాటు నెలకు ₹10,900 నుంచి ₹12,300 వరకు స్టైపెండ్ అందించనున్నారు.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 28 జూలై 2026 నుంచి ప్రారంభమై 28 ఆగస్టు 2026 వరకు కొనసాగుతుంది.

TNSTC Apprentice Recruitment ముఖ్యాంశాలు

  •  మొత్తం ఖాళీలు – 1,518 
  • Graduate, Diploma, Non-Engineering Graduates‌కు అవకాశం 
  • నెలకు ₹12,300 వరకు స్టైపెండ్ 
  • రాత పరీక్ష లేదు
  •  మార్కుల ఆధారంగా ఎంపిక
  •  NATS Portal ద్వారా మాత్రమే దరఖాస్తు
  •  చివరి తేదీ – 28 ఆగస్టు 2026

రిక్రూట్‌మెంట్ వివరాలు

అంశం - వివరాలు
సంస్థ  -    Tamil Nadu State Transport Corporation (TNSTC)
పోస్టు  -    Apprentice
మొత్తం పోస్టులు    -    1,518
దరఖాస్తు విధానం  - Online
ప్రారంభ తేదీ   -    28 జూలై 2026
చివరి తేదీ  - 28 ఆగస్టు 2026
ఎంపిక విధానం    -    మార్కుల ఆధారంగా Shortlisting + Certificate Verification
అధికారిక వెబ్‌సైట్  - NATS Portal

పోస్టుల వివరాలు

మొత్తం 1,518 అప్రెంటిస్‌షిప్ శిక్షణ స్లాట్‌లను మూడు కేటగిరీల్లో పంపిణీ చేశారు.

  1. కేటగిరీ I: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్) — 457 ఖాళీలు. B.E./B.Tech్‌లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ కలిగినవారికి అవకాశం. మెకానికల్/ఆటోమొబైల్‌లో అత్యధికంగా 360 ఖాళీలు ఉండగా, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్‌లో 41, CSE/ITలో 30, సివిల్‌లో 26 ఖాళీలు ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే MTC చెన్నై, TNSTC విల్లుపురంలలో చెరో 100 ఖాళీలు, TNSTC తిరునెల్వేలిలో 70, SETC తమిళనాడులో 68 ఖాళీలు ఉన్నాయి.
  2. కేటగిరీ II: టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ — 438 ఖాళీలు. ఇంజినీరింగ్/టెక్నాలజీలో డిప్లొమా కలిగినవారికి అవకాశం. మెకానికల్/ఆటోమొబైల్‌లో 338 ఖాళీలు, CSE/ITలో 53, సివిల్‌లో 20, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్‌లో 30 ఖాళీలు ఉన్నాయి. MTC చెన్నైలో అత్యధికంగా 138 ఖాళీలు ఉండగా, TNSTC కుంభకోణంలో 123 ఖాళీలు ఉన్నాయి.
  3. కేటగిరీ III: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్-ఇంజినీరింగ్) — 623 ఖాళీలు. BA/BSc/BCom/BBA/BBM/BCA వంటి ఆర్ట్స్/సైన్స్/కామర్స్/హ్యుమానిటీస్ డిగ్రీ కలిగినవారికి అవకాశం. TNSTC కుంభకోణంలో అత్యధికంగా 251 ఖాళీలు, TNSTC విల్లుపురంలో 100, TNSTC తిరునెల్వేలిలో 93, SETC తమిళనాడులో 80, MTC చెన్నైలో 62, TNSTC మధురైలో 37 ఖాళీలు ఉన్నాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ కేటగిరీలో TNSTC సేలంకు ఎలాంటి ఖాళీలు కేటాయించలేదు.

ప్రకటించిన ఖాళీల సంఖ్యను పెంచే లేదా తగ్గించే హక్కు సంబంధిత సంస్థలకు ఉంటుంది.

ఏ  సంస్థల్లో పోస్టులు ఉన్నాయి?

ఈ నోటిఫికేషన్ కింద  ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్లలో పోస్టులు ఉన్నాయి.

  • TNSTC Villupuram
  • TNSTC Kumbakonam
  • TNSTC Salem
  • TNSTC Madurai
  • TNSTC Tirunelveli
  • Metropolitan Transport Corporation (MTC) Chennai
  • State Express Transport Corporation (SETC)

విద్యార్హత

పోస్టును బట్టి అర్హత మారుతుంది.

  1. Graduate Apprentice
    Regular Full Time B.E / B.Tech
  2. Diploma Apprentice
    Regular Diploma
  3. Non Engineering Graduate
    BA
    B.Sc
    B.Com
    BBA
    BBM
    BCA

2022, 2023, 2024, 2025 లేదా May 2026లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.

అలాగే అభ్యర్థులు తమిళనాడుకు చెందిన వారై ఉండాలి.

వయోపరిమితి

నోటిఫికేషన్‌లో నిర్దిష్ట వయోపరిమితిని పేర్కొనలేదు.
అప్రెంటిస్ నిబంధనల ప్రకారం వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు.

స్టైపెండ్

ఎంపికైన అభ్యర్థులకు కింది విధంగా నెలవారీ స్టైపెండ్ అందుతుంది.
Graduate Apprentice  -    ₹12,300
Diploma Apprentice    -    ₹10,900

ముఖ్యమైన తేదీలు

  1. దరఖాస్తు ప్రారంభం - 28 జూలై 2026
  2. చివరి తేదీ - 28 ఆగస్టు 2026
  3. షార్ట్‌లిస్ట్ విడుదల  -    సెప్టెంబర్ రెండో వారం
  4. సర్టిఫికెట్ వెరిఫికేషన్  - సెప్టెంబర్ నాలుగో వారం

ఎంపిక విధానం (Selection Process)

TNSTC అప్రెంటిస్‌షిప్ నియామకాల్లో ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించరు. అభ్యర్థులు సాధించిన విద్యార్హత మార్కుల ఆధారంగానే ఎంపిక జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

ఎంపిక దశలు:

  •  విద్యార్హత మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ 
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్
  •  తుది మెరిట్ జాబితా విడుదల
  •  ఒక సంవత్సరం అప్రెంటిస్ శిక్షణ

అవసరమైన పత్రాలు

దరఖాస్తు సమయంలో మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఈ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి.

  1. SSC / 10వ తరగతి మార్కుల మెమో
  2. డిప్లొమా / డిగ్రీ / B.E / B.Tech సర్టిఫికెట్
  3. Consolidated Mark Memo
  4. Provisional Certificate
  5. ఆధార్ కార్డు
  6. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  7. సంతకం
  8. కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
  9. PwBD సర్టిఫికెట్ (వర్తిస్తే)
  10. NATS Enrollment Number

TNSTC Apprentice 2026కి ఎలా దరఖాస్తు చేయాలి?

అభ్యర్థులు కేవలం NATS Portal ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.

Step 1 - NATS అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
Step 2 - కొత్త అభ్యర్థులు ముందుగా Student Registration పూర్తి చేయాలి.
Step 3 - పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ నమోదు చేసి అకౌంట్ సృష్టించాలి.
Step 4 - విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
Step 5 - ఫోటో, సంతకం మరియు అవసరమైన సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలి.
Step 6 - "Apply Against Advertised Vacancies" పై క్లిక్ చేయాలి.
Step 7 - మీకు కావాల్సిన TNSTC / MTC / SETC సంస్థను ఎంపిక చేయాలి.
Step 8 - అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకొని భద్రపరచుకోవాలి.

TNSTC Apprentice 2026లో ఎవరు దరఖాస్తు చేయకూడదు?

ఈ నోటిఫికేషన్ ప్రకారం కింది అభ్యర్థులు అర్హులు కారు.

  • ఇప్పటికే Apprenticeship పూర్తి చేసిన వారు
  • ప్రస్తుతం Apprenticeship చేస్తున్న వారు
  • సంబంధిత రంగంలో ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న వారు
  • నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు లేని వారు

FAQs

1. TNSTC అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026-27లో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
మొత్తం 1,518 ఖాళీలు ఉన్నాయి — గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్‌కు 457, డిప్లొమా (టెక్నీషియన్)కు 438, గ్రాడ్యుయేట్ నాన్-ఇంజినీరింగ్‌కు 623.

2. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు?
ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఆగస్టు 28, 2026తో ముగుస్తుంది.

3. నెలవారీ స్టైపెండ్ ఎంత?
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ. 12,300, డిప్లొమా (టెక్నీషియన్) అప్రెంటిస్‌లకు నెలకు రూ. 10,900 స్టైపెండ్ లభిస్తుంది.

4. ఎవరు దరఖాస్తుకు అర్హులు?
2022, 2023, 2024, 2025 లేదా మే 2026లో ఇంజినీరింగ్/డిప్లొమా/ఆర్ట్స్-సైన్స్-కామర్స్ డిగ్రీ పూర్తి చేసిన తమిళనాడుకు చెందిన అభ్యర్థులు అర్హులు.

5. దరఖాస్తు ఎలా చేయాలి?
NATS పోర్టల్ (nats.education.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

TNSTC Apprentice Recruitment 2026

ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లకు TNSTC అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ 2026-27 ప్రాక్టికల్ అనుభవం, స్టైపెండ్ రెండూ అందించే మంచి అవకాశంగా నిలుస్తుంది. ముఖ్యంగా నాన్-ఇంజినీరింగ్ డిగ్రీ కలిగినవారికి కూడా 623 స్లాట్‌లు కేటాయించడం విశేషం. దరఖాస్తు గడువు ఆగస్టు 28లోపు ముగియనున్న నేపథ్యంలో, అర్హులైన అభ్యర్థులు NATS పోర్టల్‌లో వెంటనే నమోదు చేసుకుని దరఖాస్తు పూర్తి చేసుకోవడం మంచిది.

TNSTC Apprentice Recruitment 2026 Notification PDF - Click Here
TNSTC Apprentice Recruitment - Apply Online Link

Job Details

Street Address

Thiruvalluvar House, Pallavan Salai.

Location

Chennai

Region / State

TAMILNADU

Postal Code

600002

Hiring Organization TNSTC Apprentice Recruitment
Employment Type INTERN
CCRUM రిక్రూట్‌మెంట్ 2026 : 179 స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.!

CCRUM రిక్రూట్‌మెంట్ 2026 : 179 స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.!

CCRUM రిక్రూట్‌మెంట్ 2026 : 179 స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.! భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ …

ESIC రిక్రూట్‌మెంట్ 2026 : 122 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - రాత పరీక్ష లేదు | నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ..!

ESIC రిక్రూట్‌మెంట్ 2026 : 122 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - రాత పరీక్ష లేదు | నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ..!

ESIC రిక్రూట్‌మెంట్ 2026 : 122 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - రాత పరీక్ష లేదు | నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ..! ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC), భువనేశ్వర్‌లోని తమ మెడికల్ …

ఆంధ్రప్రదేశ్‌లో 338 స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ - దరఖాస్తు చేసుకోండి!
Vijayawada

ఆంధ్రప్రదేశ్‌లో 338 స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ - దరఖాస్తు చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్‌లో 338 స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ - దరఖాస్తు చేసుకోండి! ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకింగ్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB) 338 …

రైల్వేలో 6557 టెక్నీషియన్ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం - ITI, డిప్లొమా, B.Tech అభ్యర్థులకు భారీ అవకాశం.!

రైల్వేలో 6557 టెక్నీషియన్ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం - ITI, డిప్లొమా, B.Tech అభ్యర్థులకు భారీ అవకాశం.!

రైల్వేలో 6557 టెక్నీషియన్ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం - ITI, డిప్లొమా, B.Tech అభ్యర్థులకు భారీ అవకాశం.! రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) పెద్ద శుభవార్త …